బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవల కాలంలో తరచుగా అభిమానులకు టచ్ లో ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు నయనానందం కలిగిస్తోంది. తాజాగా కియారా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన వీడియోలో ఆమె స్టన్నింగ్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. మెడలో ఒక సింపుల్ నెక్లెస్ ధరించి, ఫుల్ గా మేకప్ తో వెస్టర్న్ దుస్తులలో మెరిసిపోయింది. ఆమె కళ్ళకు వెరైటీగా గ్రీన్ కలర్ ఐ షాడో వేసుకుంది. సాధారణంగా గ్రీన్ కలర్ ఐ షాడోను ఎక్కువగా ఉపయోగించరు సెలెబ్రిటీలు. కానీ కియారా మాత్రం ధైర్యంగా ఇలా మేకప్ తో ప్రయత్నాలు చేసేస్తోంది. ఇక ఇప్పటినుంచి ఇది ట్రెండ్ గా మారుతుందేమో..!! వీడియోలో విన్పిస్తున్న ‘గ్రీన్ ఈజ్ ది కలర్’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read Also : ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ లో గ్లోబల్ బ్యూటీ… సంపాదన చూస్తే షాక్…!!
కాగా సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ధర్మ ప్రొడక్షన్స్ మూవీ ’షేర్‌షా’లో కియారా అద్వానీ కనిపిస్తుంది. కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా ఈ వార్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నారు. ఆయనకు హిందీలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ‘షేర్ షా’ ఈ సంవత్సరం జూలైలో విడుదల కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి పరిస్థితి దృష్ట్యా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ భారీ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. కియారా ‘జగ్ జగ్ జీయో’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, నీతు సింగ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
