Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్‌డమ్ ఉరికే రాలేదు

Kiyara Advani

Kiyara Advani

బాలీవుడ్ సెన్సేషన్ కియారా అడ్వాణీ అంటే నేడు ‘కబీర్ సింగ్’, ‘ఎం.ఎస్. ధోని’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఆమె సినీ ప్రయాణం పూల బాట ఏమీ కాదని, తన మొదటి సినిమా వైఫల్యం వల్ల అవకాశాల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలే నేడు తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని ఆమె భావోద్వేగంతో వెల్లడించారు. చాలా మందికి కియారా అడ్వాణీ మొదటి చిత్రం ఏదో తెలియదు..

‘ఎం.ఎస్ ధోని’ లేదా ‘కబీర్ సింగ్’ చిత్రాలతోనే ఆమె పరిచయమయ్యారని చాలామంది భావిస్తారు. అయితే, ఆమె తొలి చిత్రం ‘ఫుగ్లీ’ (Fugly) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘ఆ సినిమా ఆడకపోవడంతో నా కెరీర్‌లో పెద్ద గ్యాప్ వచ్చింది. నటన పరంగా ప్రశంసలు దక్కినప్పటికీ, కమర్షియల్ హిట్ లేకపోవడంతో కొత్త అవకాశాలు రాలేదు. ఆ సమయంలో మళ్లీ మొదటి నుండి ఆడిషన్స్ ఇవ్వడం, ఎన్నో రిజక్ట్‌లు ఎదుర్కోవడం నాకు సవాలుగా మారింది’ అని కియారా చెప్పుకొచ్చారు. అంతే కాదు..

తొలి సినిమా సక్సెస్ కాకపోవడం తనను మానసికంగా కుంగదీసినప్పటికీ, మరింత పట్టుదలతో ముందుకు సాగేలా చేసిందని ఆమె వివరించారు. ఆ వైఫల్యమే తనను ఉత్తమ నటిగా మార్చిందని, ఫలితంగానే నేడు భారతీయ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రాజెక్టుల్లో భాగస్వామిని కాగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కియారా, కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ లో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.