Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్‌డమ్ ఉరికే రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సెన్సేషన్ కియారా అడ్వాణీ అంటే నేడు ‘కబీర్ సింగ్’, ‘ఎం.ఎస్. ధోని’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఆమె సినీ ప్రయాణం పూల బాట ఏమీ కాదని, తన మొదటి సినిమా వైఫల్యం వల్ల అవకాశాల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలే నేడు తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని ఆమె భావోద్వేగంతో వెల్లడించారు. చాలా మందికి కియారా అడ్వాణీ మొదటి చిత్రం ఏదో తెలియదు..
‘ఎం.ఎస్ ధోని’ లేదా ‘కబీర్ సింగ్’ చిత్రాలతోనే ఆమె పరిచయమయ్యారని చాలామంది భావిస్తారు. అయితే, ఆమె తొలి చిత్రం ‘ఫుగ్లీ’ (Fugly) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘ఆ సినిమా ఆడకపోవడంతో నా కెరీర్‌లో పెద్ద గ్యాప్ వచ్చింది. నటన పరంగా ప్రశంసలు దక్కినప్పటికీ, కమర్షియల్ హిట్ లేకపోవడంతో కొత్త అవకాశాలు రాలేదు. ఆ సమయంలో మళ్లీ మొదటి నుండి ఆడిషన్స్ ఇవ్వడం, ఎన్నో రిజక్ట్‌లు ఎదుర్కోవడం నాకు సవాలుగా మారింది’ అని కియారా చెప్పుకొచ్చారు. అంతే కాదు..
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
తొలి సినిమా సక్సెస్ కాకపోవడం తనను మానసికంగా కుంగదీసినప్పటికీ, మరింత పట్టుదలతో ముందుకు సాగేలా చేసిందని ఆమె వివరించారు. ఆ వైఫల్యమే తనను ఉత్తమ నటిగా మార్చిందని, ఫలితంగానే నేడు భారతీయ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రాజెక్టుల్లో భాగస్వామిని కాగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కియారా, కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ లో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!