శంకర్ జోరు చూపిస్తున్నాడు. ఓ వైపు చరణ్ తో సినిమా పనులు కానిస్తూనే అప్పుడెపుడో తీసిన ‘అన్నియన్’ ని బాలీవుడ్ లో రణ్ వీర్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయమై నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేసిన హెచ్చరికకు ప్రతిగా సవాల్ చేసిన శంకర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ‘అపరిచితుడు’కి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడట. ‘భరత్ అనే నేను’లో మహేశ్ కి జోడీగా నటించిన కియారా అద్వానినీని రణ్ వీర్ కి జోడీగా ఎంచుకున్నాడట. ఇప్పటికే కియారా సంతకం కూడా చేసిందని టాక్. ఈ ఏడాది ప్రారంభం కావలసిన చరణ్ సినిమా హీరోయిన్ ని ఇంకా ఖరారు చేయకుండా వచ్చే ఏడాది పట్టాలెక్కబోయే బాలీవుడ్ ‘అపరిచితుడు’ కి జోడీని సెట్ చేసేశాడు శంకర్. అంటే ఈ సినిమా వివాదంపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని శంకర్ చెప్పకనే చెబుతున్నాడన్నమాట. మరి శంకర్ లేఖకి ఆస్కార్ రవిచంద్రన్ ప్రతి స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. అటు రవిచంద్రన్… ఇటు శంకర్ ఈ విషయంలో ఓ రాజీకి వస్తారా? లేక సై అనుకుంటూ కోర్టు మెట్టులు ఎక్కుతారో చూడాలి.
హిందీ ‘అపరిచితుడు’కి జోడీగా మహేశ్ హీరోయిన్!
