బాలీవుడ్ చరిత్రలో చిరస్మరణీయమైన నటి మీనా కుమారి. ఆమె పేరు వింటేనే ఒక కాలం గుర్తుకు వస్తుంది. “పాకీజా”, “సాహిబ్ బీబీ ఔర్ గులామ్”, “బైజూ బావ్రా” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో ఆమె నటన ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న బయోపిక్.. “కమల్ ఔర్ మీనా” చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, మీనా కుమారి పాత్రలో..
Also Read : Ustad-bhagat-singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ రెడీ – ఫస్ట్ సింగిల్ కౌంట్‌డౌన్ స్టార్ట్!
కియారా అద్వానీ నటించనున్నట్లు గతంలో ప్రచారం జరిగినా, తాజాగా ఆమె అధికారికంగా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. కియారా ఈ పాత్ర కోసం ఇప్పటికే ప్రత్యేక వర్క్‌షాప్‌లు అటెండ్ చేస్తోందని, ఆమె లుక్ టెస్ట్ కూడా విజయవంతంగా పూర్తయిందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, 1950-60ల దశాబ్దపు నటి శైలిని రీసెర్చ్ చేస్తోందట. కాగా ఇప్పటికే సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లో భారీ స్థాయిలో రూపొందనుందట.
కాగా ఈ సినిమా కథలో మీనా కుమారి వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలు, ఆమె భర్త కమల్ అమ్రోహితో ఉన్న సంబంధం, ఆమె కెరీర్‌లోని గ్లామర్ వెనుక దాగి ఉన్న బాధల చుట్టూ తిరుగుతుందట. కమల్ అమ్రోహి పాత్ర కోసం చిత్రబృందం ప్రస్తుతం పలువురు యువ నటులతో చర్చలు జరుపుతోంది. ఈ బయోపిక్‌లోని మ్యూజిక్, ఆర్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్ అన్నీ పాత బాలీవుడ్ గ్లామర్‌ను తిరిగి తెరపైకి తీసుకురావాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం “కమల్ ఔర్ మీనా” బయోపిక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మీనా కుమారి వంటి మహానటి పాత్రలో కియారా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
