Site icon NTV Telugu

Don 3 : డాన్ 3 హీరోయిన్ పై.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్!

Kiara Advani

Kiara Advani

బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాణీ పెళ్లి త‌ర్వాత బిజీయెస్ట్ క‌థానాయిక‌ గా మారిపోయింది. క‌రీనా, క‌త్రిన, ఆలియా త‌ర‌హాలోనే కియ‌రా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్రజంట్ కియారా అద్వాణీ నటించిన ‘వార్ 2’ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా. అదే సమయంలో ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ లోనూ కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీల్లో ‘డాన్’ సీరీస్ ఒకటి. అందులో భాగంగా రాబోయే ‘డాన్3’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్ టైటిల్ రోల్‌ లో నటిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో కియారా స్థానంలో కృతి సనన్ ఈ చిత్రంలో నటించబోతుందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలు ఎక్కువగా వైరల్ కావడంతో, చిత్ర యూనిట్ ఇప్పుడు అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

Also Read : Regina Cassandra : ‘నా తల్లే అడగడం లేదు.. మీకు ఎందుకు’- రెజీనా ఫైర్ !

‘డాన్ 3’లో కథానాయికగా కృతి సనన్ కాదని, కియారా అద్వాణీ‌యే నటించనున్నారని స్పష్టమైంది. ప్రజంట్ కియారా గర్భవతిగా ఉండటం వల్ల చిత్రీకరణ ఆలస్యం అయినప్పటికీ, ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని యూనిట్ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌ను 2026 జనవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే, కియారా – రణవీర్ కాంబినేషన్‌లో రాబోయే ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version