NTV Telugu Site icon

Khel Khatam Darwaja Bandh: ఆసక్తికరంగా ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” ఫస్ట్ లుక్

Khel Khatam

Khel Khatam

Khel Khatam Darwaja Bandh First Look launched: “డియర్ మేఘ”, “భాగ్ సాలే” వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

Devara 2: వర వీర విహారమే పార్ట్ 2 .. హైపెక్కించేస్తున్న కొరటాల

“ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ – స్ఫూర్తి రావు, ఆర్ట్ డైరెక్టర్ – మోహన్ జి, కొరియోగ్రఫీ – ఈశ్వర్ పెంటి అందిస్తున్నారు. ఉదయ్ కుమార్ డి ఎడిటర్ గా, కార్తీక్ కొప్పెర డీవోపీగా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అశోక్ రెడ్డి కడదూరి ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.

Show comments