NTV Telugu Site icon

Mastan Sai: మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్..డ్రగ్స్ తో పరార్?

Masthan Sai

Masthan Sai

మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. మస్తాన్ సాయి ఇంట్లో చేసుకున్న డ్రగ్స్ పార్టీల పై పోలీసులు దృష్టి సారించారు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన డ్రగ్స్ పార్టీల వీడియోల్లో ఉన్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో రాహుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు లావణ్య ఇంట్లో MDMA డ్రగ్స్ పెట్టాలని బెంగళూరు నుండి మస్తాన్ సాయి , చింటూ ఆర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Anagani Satya Prasad: జగన్‌పై అనగాని సెటైర్లు.. ఎమ్మెల్యేలను కూడా కలవలేదు.. కార్యకర్తలకు అండగా ఉంటారట..!

వాడి ఆర్డర్ మీద 130 గ్రాముల డ్రగ్స్ ను గుంటూరు నుండి హైదరాబాద్ కి తీసుకొచ్చిన ఖాజా అవి లావణ్య ఇంట్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి తో పాటు ఖాజ ను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు ఖాజా కు 41 నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు. ఈ క్రమంలో ఆ డ్రగ్స్ ను తీసుకొని ఖాజా పరారయ్యాడు అని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో ఖాజాతో పాటు మరో 10 మంది కోసం గాలిస్తున్నారు పోలీసులు.