యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పలువురు ప్రముఖ నట దిగ్గజాలను ఇందులో నటింపజేయనున్నారు మేకర్స్. ఇందులో ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి తదితరులు కనిపించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రముఖ నటుడు జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ “ఖైదీ” చిత్రంలో కీలకపాత్రలో నటించిన నరైన్ “విక్రమ్” టీంలో జాయిన్ అయ్యారట.
Read Also : దిశా పఠానీ ‘బంతాట’! ‘వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్’ అంటోన్న హాట్ గాళ్…
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పూర్తయ్యే దశలో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ‘విక్రమ్’ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు గెలుచుకున్న స్టంట్ కో-ఆర్డినేటర్స్ అన్బరివ్ ద్వయాన్ని రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఇక రోజుకో సినిమా అప్డేట్స్ వస్తుండడంతో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
