నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా మొదలవ్వాల్సి ఉంది. రేపు ఉదయం ముహూర్తం అనగా ఆరోగ్యం బాలేదని చెబుతూ మోక్షజ్ఞ తేజ వెనకడుగు వేయడంతో ఆ సినిమా ఓపెనింగ్ ఆగిపోయింది. అయితే సినిమా ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఇంకా సినిమాలు చేసేందుకు రెడీగా లేడని తండ్రి బలవంతం మీద సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు కానీ చివరి నిమిషంలో ప్రెషర్ తట్టుకోలేక తప్పుకున్నాడు అంటూ ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
The Raja Saab: ‘రాజాసాబ్’పై పుకార్లు.. స్పందించిన టీమ్
తాజాగా ఇదే విషయం మీద ప్రశాంత్ వర్మ టీమ్ స్పందించింది. సినిమా గురించి ఆధారం లేని రూమర్స్ ఎన్నో తిరుగుతున్నాయని, అయితే అవేవీ నిజం కాదు అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదైనా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అఫీషియల్ లేదా లెజెండ్ ప్రొడక్షన్స్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే వెల్లడిస్తామని, అప్పటి వరకు జనరల్ పబ్లిక్ కానీ మీడియా కానీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది.