NTV Telugu Site icon

Raghu Thatha: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్ ‘రఘు తాత’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

Keerthy Suresh's 'raghu Tha

Keerthy Suresh's 'raghu Tha

Keerthy Suresh’s ‘Raghu Thatha’ to Stream on ZEE5: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ తరుణంలో కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. ‘నమ్మిన దాని కోసం నిలబడే ఓ ధైర్యశాలి పాత్రను రఘు తాత చిత్రంలో పోషించడం ఆనందంగా ఉంది. ఆ పాత్రకు జీవం పోయడం ఓ సవాలుగా అనిపించింది. ZEE5లో ఈ ఆకర్షణీయమైన కథనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అవుతుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

Pawan Kalyan: హైడ్రా వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రఘు తాత’ సినిమా మా జీవితంలో ఓ మరపురాని ప్రయాణంగా నిలుస్తుంది. ఈ చిత్రం భాష, ప్రాంతం అన్న తేడా లేకుండా అందరినీ అలరించగలిగింది. ఇక ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు. హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘రఘు తాత’ ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ZEE5తో భాగస్వామి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. విజువల్ ట్రీట్, ఎమోషనల్ జర్నీగా సాగే రఘు తాత చిత్రం ఈ ZEE5 ద్వారా అందరి వద్దకు చేరుతోంది. ‘రఘుతాత’ అనేది మాకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. ఇది సున్నితత్వం, హాస్యంతో ఉండటమే కాదు సామాజిక సమస్యలు తెలియజేస్తుంది’ అని అన్నారు.

Show comments