నాలుగు రోజుల క్రితం దుబాయ్ లో మరణించిన నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ ఇంకా తేలడం లేదు. దుబాయ్ పోలీసులు ఇప్పటివరకు పోస్టుమార్టం రిపోర్ట్ బయట పెట్టలేదు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడని, గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ ఆయన ఎలా చనిపోయాడనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకపక్క కేదార్ మృతదేహం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క కేదార్ను నమ్మి డబ్బులు ఇచ్చిన ముగ్గురు ప్రొడ్యూసర్లు ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయన మృత దేహం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
Sree Vishnu : ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్
అందులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కేదార్ మరణించిన సమయంలో అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. కేదార్ మరణించాక వారిలో ఒక మాజీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా దుబాయ్ పోలీసులు రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. ఇక కేదార్ కు నిర్మాతలు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి 100 కోట్ల వరకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేదార్ మరణించడంతో ఆ డబ్బు ఎలా వెనక్కి రాబట్టుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో వారు పడ్డారని తెలుస్తోంది. కేదార్ తెలుగులో గంగం గణేశా అనే సినిమా నిర్మించారు. తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.