Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ వర్సటైల్ నటుడు సూర్య ప్రస్తుతం వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించడంతో పాటు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అదే జోష్ లో తెలుగు దర్శకుడితో చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పడు సూర్య 50వ సినిమా ఏంటనే దానిపై ఒకటే డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా ‘కరుప్పు 2’ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కోలీవుడ్ సినీ వర్గాల్లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
విశిష్టమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సూర్య కెరీర్లో 50వ చిత్రంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ‘కరుప్పు 2’ రూపుదిద్దుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కరుప్పు బ్లాక్ బస్టర్ కావడం దృష్ట్యా దీని సీక్వెల్‌ను సూర్య ల్యాండ్‌మార్క్ మూవీగా తీసుకువస్తే హైప్ భారీగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మైలురాయి ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీతో డిస్కషన్స్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘రోలెక్స్’ స్టాండలోన్ సినిమా లేదా సీక్వెల్స్ కూడా సూర్య 50వ ప్రాజెక్ట్ రేసులో ఉన్నాయనే ప్రచారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే సూర్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఏ దర్శకుడి వైపు మొగ్గు చూపుతారు ‘కరుప్పు 2’ సీక్వెల్ ప్రకటన ఎప్పుడు రానుంది అనే విషయాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.
Also Read
- Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
- Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
- Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
తాజావార్తలు
-
Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!