ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెండవ చిత్రం “ఖైదీ”. 2019లో విడుదలైంన ఈ చిత్రంలో కార్తీ, నరేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తలపతి విజయ్ “బిగిల్”తో పోటీ పడిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి. అంతేకాకుండా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించింది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కనుందని, ఇతర భాషల్లో కూడా రీమేక్ కానుందనే వార్తలు వస్తున్నాయి.
Read Also : కొత్త మూవీకి తేజ సజ్జ షాకింగ్ రెమ్యూనరేషన్…!!?
కేరళకు చెందిన రాజీవ్ అనే వ్యక్తి “ఖైదీ” సినిమా కథ తనదేనని చెబుతూ కేరళ కోర్టుకెక్కడంతో వివాదం మొదలైంది. ఓ ఒక హత్య కేసులో అరెస్ట్ అయిన తాను 2007లో విడుదలయ్యానని, ఆ తరువాత ఓ స్నేహితుడి ద్వారా పతన కథను నిర్మాణసంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ కు వివరించానని, దానికోసం అడ్వాన్స్ కూడా అందుకున్నానని అతను చెప్పుకొచ్చాడు. కానీ తరువాత తన కథను నిర్మాణ సంస్థ లోకేష్ కనగరాజ్‌తో చిత్రీకరించారని రాజీవ్ ఆరోపించారు. దీనికి పరిహారంగా, కథపై లైసెన్స్ కూడా కోరుతూ తనకు రూ.4 కోట్లు చెల్లించాలంటూ కేరళ కోర్టులో కేసు పెట్టారు. దీంతో ఈ కేసులో ఏది నిజమో నిరూపితమవ్వకుండా “ఖైదీ” తరువాత భాగం, ఇతర భాషలలో రీమేక్‌లు చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఈ విషయంపై చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు “ఖైదీ” రీమేక్ లేదా పార్ట్ 2 చేయడానికి వీల్లేదంటూ కేరళ కోర్టు ఆదేశించినట్టు కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు మాకు తెలియదు. కాబట్టి దీనిపై అప్పుడే స్పందించలేము. ఈ విషయాన్ని చట్టబద్ధంగా సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేసులో పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే వరకు ఈ విషయంపై ప్రతికూలంగా రాయొద్దని మేము మీడియాను అభ్యర్థిస్తున్నాము” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
