తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన తాజా రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘రెట్రో’. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో మంచి స్పందన సాధిస్తున్నప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘రెట్రో’ సినిమాకు రివ్యూయర్స్, సినీ ప్రేమికుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. సినీ క్రిటిక్స్ లో కొందరు సూర్య ఇటీవలి కాలంలో కనబరిచిన ఉత్తమ నటన అని ప్రశంసల వర్షం కురిపించగా, మరికొందరు కథనంలోని లోపాలను, స్క్రీన్‌ప్లేలోని మైనస్ పాయింట్స్ ను ను ఎత్తి చూపుతున్నారు.
Read More:Suhas : ఊరమాస్ లుక్ లో సుహాస్.. పోస్టర్ తోనే హైప్..
ఈ నేపథ్యంలో, కొన్ని ఆన్‌లైన్ రివ్యూలపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “ఆన్‌లైన్ రివ్యూలను చూడకూడదు, అలా అని సినిమా రివ్యూ చేయడం కరెక్ట్ కాదని నేను అనడం లేదు, కానీ చాలా రివ్యూల వెనుక కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఒక రివ్యూ చూస్తే, అది నిజాయితీగా రాసినదా లేక ఏదో అజెండాతో రాసినదా అని అర్థమవుతుంది. ‘రెట్రో’ తర్వాత నేను ఆన్‌లైన్ రివ్యూలు చూడడం ఆపేశాను,” అని పేర్కొన్నారు.
Read More:Nandamuri Balakrishna: బాలయ్య సీరియస్ వార్నింగ్.. వాళ్ల జోలికి వస్తే ఖబర్దార్..
సూర్య నటించిన ‘రెట్రో’ ఇంకా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరలేదు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. తమిళనాడులో ‘రెట్రో’ తొలి రోజు రూ. 17.25 కోట్ల నెట్ వసూళ్లతో సూర్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తొలి రోజు కేవలం రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, తర్వాతి రోజుల్లో రూ. 67 లక్షలు, రూ. 65 లక్షలతో మరింత కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. ఈ లెక్కలు చూస్తే తెలుగులో బ్రేక్-ఈవెన్ సాధించే అవకాశం తక్కువగా ఉందని సూచిస్తున్నాయి.
