Site icon NTV Telugu

‘మాస్క్ పొడు’ అంటూ వీడియో షేర్ చేసిన కార్తీ

Karthi Shares Maskpodu Video

దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం లాక్ డౌన్ ను విధించాయి. ఇక పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ‘మాస్క్ పొడు’ అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ఎంతో ముఖ్యం. అయితే మాస్క్ ప్రాధాన్యతను తెలుపుతూ ‘మాస్క్ పొడు’ సాంగ్ వచ్చింది. “కరోనా నుంచి రక్షణకు ఉత్తమ మార్గం! #maskpodu మాస్క్ ధరించండి. టైట్ గా ధరించండి. సరిగ్గా ధరించండి. డబుల్ మాస్క్ ధరించండి!” అంటూ కార్తీ ఈ వీడియోను షేర్ చేశాడు.

Exit mobile version