Site icon NTV Telugu

అభిమానులకు కార్తీ రిక్వెస్ట్…!

Karthi Request to Fans on his 44th Birthday

తమిళ స్టార్ హీరో కార్తీ ఈరోజు 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తీ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దంటూ అభిమానులను అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజున అభిమానులు తమ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే తనకు వారిచ్చే మంచి బహుమతి అని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మాస్కులు, శానిటైజర్లు వాడడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్, భద్రతా చర్యలకు కట్టుబడి ఉండాలని కోరారు. కార్తీ ఈ రోజు తన పుట్టినరోజును కుటుంబంతో కలిసి ఇంట్లో జరుపుకోనున్నారు. ఇక కార్తీ చివరిసారిగా “సుల్తాన్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కార్తీ… మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటించనున్నాడు. విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, జయరామ్‌లతో పాటు ప్రభు, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లెక్ష్మి, శోభితా ధూలిపాళ్ల కూడా ఈ భారీ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. మరోవైపు కార్తీ హీరోగా ‘సర్దార్’ చిత్రం రూపొందుతోంది.

Exit mobile version