Site icon NTV Telugu

Karthi : ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కార్తీ..

Vaa Vathiyaar

Vaa Vathiyaar

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన ఈ సినిమాకు వా వాతియార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

Also Read : Sweeti : ఆ కారణంగానే అనుష్క బయటకు రావడం లేదా?

కార్తీ పోలీసాఫీసర్‌గా సరికొత్త గెటప్‌లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కన్నా వెనుక స్టార్టైన సత్యం సుందరం, సర్దార్ రిలీజ్ అయి హిట్ గా అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. ఈ సినిమా షూటింగ్ డిలే కార్తీకి ఇబ్బంది మారింది. ఒకనొక దశలో వా వాతియార్ సినిమా ఆగిపోయిందని టాక్ కూడా వినిపించింది. అనేక ఇబ్బందుల తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత జూన్‌లో అనుకుంటే.. అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కలేదు. సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేసారు అది కుదరలేదు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది చివరి డిసెంబరులో వా వాతియార్ ను రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసారు మేకర్స్. మొత్తానికి ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Exit mobile version