‘కర్ణన్’ తెలుగు హక్కులు బెల్లంకొండవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లలో ప్రదర్శించినా అద్భుతమైన విజయాన్ని సాధించటం విశేషం. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. లాల్, నటరాజసుబ్రహ్మణ్యం, యోగిబాబు, లక్ష్మీప్రియ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. వి క్రియేషన్స్ లో ‘అసురన్’ తర్వాత కలైపులి ధాను ధనుష్ తో తీసిన సినిమా ఇది. 1995లో కొడియాన్ కులమ్ లో జరిగిన వయొలెన్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. ఇటీవల ‘అసురన్’ సినిమాతో ధనుష్ కి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు దక్కింది. ఇప్పుడు ‘కర్ణన్’ చూసిన ప్రేక్షకులు మరోసారి ధనుష్ కి జాతీయ అవార్డు రావటం ఖాయం అంటున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటిన ‘కర్ణన్’ తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ జరిగింది. అయితే ఆ పోటీలో బెల్లంకొండ సురేశ్ గెలిచినట్లు సమాచారం. ఫ్యాన్సీ రేటుకు బెల్లంకొండ ‘కర్ణన్’ హక్కులను సొంతం చేసుకున్నాడట. మరి బెల్లంకొండ ఈ సినిమాను తన కుమారుడుతో రీమేక్ చేస్తాడా? లేక వేరే హీరోతో తీస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!