2023లో వచ్చిన ‘కాంతారా’ సినిమా ఎలాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కేవలం రూ.16 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 450 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. రిషబ్ శెట్టి దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇక ఈ సినిమాకు మూలం అయిన కథను మొదటి పార్ట్‌గా ‘కాంతార ఛాప్టర్-1’ తెరకెక్కిస్తున్నారు. కాగా ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం ఈ సినిమా గురించి పెద్దగా ఏ వివరాలు వెల్లడించలేదు. కానీ, ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్న తరుణంలో, మేకర్స్ శుక్రవారం ఒక ప్రత్యేక అప్‌డేట్‌ను విడుదల చేశారు.
Also Read : Mrunal Thakur : “కర్వీ అంటే బలహీనత కాదు” – మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్..
ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రుక్మిణి వసంత్ లుక్‌ను రివీల్ చేస్తూ, ఆమె పోషిస్తున్న ‘కనకవతి’ పాత్రను అధికారికంగా పరిచయం చేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో రుక్మిణి రాజసమైన లుక్‌తో మెరిసిపోగా, ఆ పాత్రకు తగిన శక్తి, గంభీరత స్పష్టంగా కనిపిస్తోంది. పౌరాణిక వాతావరణం కలిగిన ఈ పాత్ర సినిమా కథలో కీలక స్థానాన్ని సంపాదించనుందని చిత్రబృందం చెబుతోంది. ప్రేక్షకులలో ఇప్పటికే ఈ చిత్రంపై ఆసక్తి అధికంగా ఉండగా, “కనక వతి” లుక్ రివీల్ ఆ ఉత్సాహాన్ని మరింత పెంచింది. రిషబ్ శెట్టి విజన్, అద్భుతమైన టెక్నికల్ టీమ్, శక్తివంతమైన పాత్రలతో కూడిన “కాంతారా చాప్టర్ 1” ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.
