NTV Telugu Site icon

Suriya : కంగువ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Kanguva

Kanguva

స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.  నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Also Read : Komatireddy : సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మొదటి ఆట నుండే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి వారంలోనే థియేటర్ రన్ ముగించుకుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా మిగిలింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ప్లాప్ కావండంతో అనుకున్న టైమ్ కంటే ముందుకు ఓటీటీ రిలీజ్ చేస్తుంది అమెజాన్. కంగువ ను డిసెంబరు 13న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు తీసుకువస్తునట్టు ప్రకటించింది. థియేటర్ రిలీజ్ అయ్యాక సౌండింగ్, రన్ టైమ్ పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంది, సౌండింగ్ ను చేంజ్ చేసి, రన్ టైమ్ ను ట్రిమ్ చేసిన కూడా ఫలితం లేకుండా పోయిన ఈ సినిమా ఓటీటీలో గుర్తింపు తెచుకుంటుందో లేదో చూడాలి.

Show comments