Site icon NTV Telugu

ఇందిరా గాంధీగా కంగనా మేకోవర్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఆమె.. మరోవైపు పవర్ ఫుల్ పాత్రలు కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటుంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషించబోతోంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. సాయి కబీర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని కంగన నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్‌ పనులను కంగనా మొదలుపెట్టింది. ఇందిరా గాంధీ లుక్‌ కోసం మేకప్‌ చేయించుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రతి కొత్త పాత్ర కోసం అందమైన ఆరంభం.. ఎంతో మంచి అద్భుతమైన ఆర్టిస్టులతో ‘ఎమర్జెన్సీ’ ప్రయాణం మొదలుపెట్టినట్లు కంగనా చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

Exit mobile version