బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన రాజకీయ ప్రయాణం, సామాజిక సేవ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన కంగనా, రాజకీయాల్లో సెటిల్ అవ్వడం అంత తేలికైన పని కాదని చెప్పారు. ఆమె మాటల్లో..
Also Read : Alia Bhatt : అలియా భట్‌కి రూ.76 లక్షల మోసం – మాజీ పీఏ వేదిక శెట్టి అరెస్ట్!
‘తాను రాజకీయాల్లో కంప్లీట్‌గా సెటిలవలేదని, ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పటికీ ఆ పదవిని, పొలిటికల్ లైఫ్‌ను ఆస్వాదించలేకపోతున్న. రాజకీయ రంగం చాలా భిన్నమైనది. అది నా నేపథ్యం కూడా కాదు, మహిళల హక్కులపై పోరాడిన నా దృష్టికి ప్రజలు తీసుకొస్తున్న సమస్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేను ఎంపీని అయినప్పటికీ ప్రజలు నా వద్దకు వచ్చి పంచాయితీ స్థాయి సమస్యలను చెప్తున్నారు, రోడ్లు, నాలాలు బాలేవని చెప్తుంటారు, తమ సమస్య రాష్ట్ర ప్రభుత్వం స్థాయిదని చెప్పినా వారు అర్థం చేసుకోవడం లేదు. పైగా నా సొంత డబ్బును ఉపయోగించి ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయమని ప్రజలు అంటున్నారు’ అని కంగనా రనౌత్ అసహనం వ్యక్తం చేశారు.
అలాగే మీకు ప్రధాని కావాలనే టార్గెట్ ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు కూడా ఆమె స్పందించారు. ‘నేను ప్రధాని పదవికి సరిపోతానని అనుకోవడం లేదు, ఆ కోరిక కూడా లేదు, సామాజిక సేవ చేయడం నా నేపథ్యం కాదు, నేను పూర్తిగా ప్రజాసేవకు డెడికేట్ అయ్యే రకాన్ని కూడా కాదు, పైగా లగ్జరీని అనుభవించాలనే స్వార్థం కూడా నాకు ఉంది. ఇవన్నీ చూస్తూ దేవుడు నను ప్రధాని చేయడు. అసలు ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో నను రాజకీయాల్లోకి పంపాడో తెలియదు కానీ.. ప్రజల కోసం లైఫ్ మొత్తాన్ని త్యాగం చేసే ఉద్దేశం నాకు లేదు’ అని వెలడింది. ప్రస్తుతం కంగనా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
