బాలీవుడ్ నటి, హిమాచల్ లోని మండి బిజెపి ఎంపి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో తన కొత్త కేఫ్ ‘ది మౌంటైన్ స్టోరీ’ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇది తన చిరకాల స్వప్నంగా కంగనా రనౌత్ అభివర్ణించింది. ఈ కేఫ్ ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల దినోత్సవం రోజున అంటే రేపు సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా ఎంపీ కంగనా రనౌత్, వాస్తవానికి జిల్లాలోని సర్కాఘాట్‌లోని భంబ్లాలో పుట్టింది.
Urvashi: చిరంజీవి మా పాలిట దేవదూతలా కనిపించారు.. ఊర్వశి ఎమోషనల్
ఈ మధ్యనే కంగనా మనాలిలో తన ఇంటిని కూడా నిర్మించుకుంది. కంగనా ఇప్పుడు అక్కడ ఒక కేఫ్ తెరిచింది. ఇప్పుడు ఆమె ఒక హోటల్ కూడా తెరవబోతోంది. ఇటీవలే ఆమె ఇక్కడ భూమి కొన్నాడు. కొన్ని రోజుల క్రితం, కంగనా రనౌత్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక వీడియోను షేర్ చేసి, తన కేఫ్ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని అందించింది. హిమాచల్‌లో ఒక కేఫ్ తెరవడం తన చిన్ననాటి కల నెరవేరినట్లుగా ఉందని కంగనా అన్నారు. ఇప్పుడు మనాలి సందర్శించే పర్యాటకులు మండి ఎంపీ కంగనా రనౌత్ కేఫ్ హౌస్ రుచులు ఆస్వాదించగలరు.