ప్రముఖ నటుడు కమల్ కామరాజ్ పరోక్షంగా భారత ప్రధాని మోదీపై నిరసన గళం విప్పారు. తాజాగా తన ట్విట్టర్ అక్కౌంట్ లో ఓ పోస్టర్ ను పోస్ట్ చేశాడు కమల్ కామరాజ్. మా పిల్లల వాక్సిన్లను మీరు విదేశాలకు ఎందుకు పంపారు
అంటూ హిందీలో ఉత్తర భారతీయులు కొందరు పోస్ట్ పెట్టినందువల్ల దాదాపు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతూ, ఈ హిందీ పోస్టర్ ను ఇతరులకు తెలియచేయడానికి తాను ఇంగ్లీష్ లో పెట్టానని తెలిపాడు. నటుడే కాకుండా చక్కని చిత్రకారుడు కూడా అయిన కమల్ కామరాజ్ కుటుంబం మొదటి నుండి భారతదేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటోంది. ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల సైతం ఈ కుటుంబానికి చెందిన వ్యక్తే. తమ కళ్లముందున్న వ్యక్తులకు ఏ అన్యాయం జరిగిన వెంటనే నిరసన తెలపడం వీరికి ఇవాళ కొత్త కాదు! మరి 25 మంది అరెస్ట్ కు కారణమైన ఆ పోస్టర్ ను ఇప్పుడు కమల్ కామరాజ్ ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి పోస్ట్ చేయడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెటిజన్లలో కలుగుతోంది.
మోదీపై కమల్ కామరాజ్ నిరసన గళం!
