Site icon NTV Telugu

Kamal Haasan: త్రిష తో బనానా జోక్.. ఈ వయసులో అవసరమా?

Kamal Hason And Trisha

Kamal Hason And Trisha

ఎంత పెద్ద నటీనటులు అయినా సరే మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి లేదంటే అనూహ్యంగా వివాదాల బారిన పడటం తప్పదు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇలాగే త్రిషతో మాట్లాడి ఇప్పుడు ఇబ్బందుల పాలయ్యాడు. అసలు విషయం ఏమిటంటే మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘తగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, త్రిషతో పాటు శింబూ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సినిమా జూన్‌లోనే రిలీజ్‌కి రెడీ అవుతూ ఉండడంతో ఇప్పటికే ఒక సాంగ్ లాంచ్ చేశారు. తమిళంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరు త్రిష ఫేవరెట్ ఫుడ్ గురించి అడిగారు.

Also Read: Satya : ‘రావు బహదూర్’ గా వస్తున్న సత్యదేవ్..

దానికి ఆమె బాయిల్డ్ బనానా అని చెబుతూ.. దానిని తమిళంలో ఏదో అంటారు, అది నోరు తిరగడం లేదంటూ చెప్పుకొచ్చింది. దానికి వెంటనే కమల్ హాసన్ కల్పించుకొని, పేరెంటో తెలియదు కానీ నోట్లో పెట్టుకోవడం మాత్రం ఇష్టం అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా వెంటనే చేత్తో ఆమె తొడ మీద చరిచాడు. దీంతో ఈ వయసు వచ్చినా సరే ఇలాంటి కామెంట్స్ చేయడమేంటి అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రం ‘ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదు, మీ బూతు బుర్రలతో ఆలోచిస్తే అంతా బూతులాగానే’ అనిపిస్తుంది అంటూ వెనకేసుకొస్తున్నారు. అయితే ఆ వీడియో చూస్తే మాత్రం కమల్ హాసన్ డబుల్ మీనింగ్‌తోనే మాట్లాడాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయనకు అలాంటి ఉద్దేశం లేకపోయినా, త్రిష వంక చూస్తూ ఆ మాటలు మాట్లాడడం, వెంటనే తొడ మీద చరచడం వంటివి దాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాయని చెప్పాలి. మరి ఈ విషయం మీద కమల్ హాసన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version