Kamal Haasan Says he did Indian 2 only because of Indian 3: ఇండియన్ 2ని ఎలాగైనా హిట్ చేయాలని చిత్ర బృందాన్ని వివిధ రాష్ట్రాలకి ప్రమోషన్ నిమిత్తము తీసుకెళ్తున్నాడు దర్శకుడు శంకర్. అయితే కమల్ హాసన్ సమస్య ఏమిటో తెలియడం లేదు కానీ ఆయన ఇండియన్ 2కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 28 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా నేటికీ ఒక కల్ట్ హిట్ అని చెప్పక తప్పదు. పాటల దగ్గర్నుంచి సినిమా కథ, నటన, కమల్ మేకప్ ఇలా అన్నీ ఈరోజుకు కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు శంకర్ భారతీయుడు 2ని అంతకంటే భారీగా రూపొందించగా, ఈ చిత్రం జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా, కమల్ హాసన్ ఇటీవల చేసిన ప్రకటనలు భారతీయుడు 2 పై అతని అభిమానుల అంచనాలను తగ్గించాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Salman Khan: సినిమా షూటింగ్‌లో సల్మాన్‌ను హత్య చేసేందుకు ప్లాన్..పాకిస్థానీ ఆయుధ వ్యాపారితో?
భారతీయుడు 2కి ప్రమోషన్స్ ఎక్కువగా చేయకుండా కమల్ ఈ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే భావన ఆయన అభిమానులకు కలుగుతోంది. ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఇండియన్ 3 సహా ఇండియన్ 4 అలాగే 5 వస్తాయా? అని తాజాగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇండియన్ 2 కోసం 4 గంటలకు మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని కమల్ అన్నారు. అంతేకాదు అభిమానులు ముందుగా ఇండియన్ 2 కంటే ఎక్కువ 3ని ఇష్టపడాలని కమల్ బదులిచ్చారు. తాను అసలు ఈ రెండో సీక్వెల్ చేయడానికి అసలు కారణం సినిమా ఫ్రాంచైజ్ లో ఉన్న మూడో భాగం అని ఆయన అన్నారు. ఈ మూడో భాగం రిలీజ్ కి ఇంకా ఆరు నెలలు ఉంది కానీ దానికోసం అయితే తాను వేచి ఉండలేక పోతున్నానని కామెంట్ చేశారు. వందల కోట్ల బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన భారతీయుడు 2 తమిళ సినిమాకు ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చిన కమల్ అభిమానులు ఇప్పుడు ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. జులై 12న అన్ని కన్ఫ్యూజన్స్ తొలగిపోతాయి కాబట్టి సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.