Site icon NTV Telugu

Kamal Haasan: ఇంకా దొరకని అవార్డ్స్ చాలా ఉన్నాయి..కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Kamal Haasan News

Kamal Haasan News

Kamal Haasan Interesting Comments on Awards: యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది.

Karthikeya: ఆ వీడియోలో భాగమైనందుకు చింతిస్తున్నా.. ప్రణీత్ హనుమంతు వివాదంపై హీరో స్పందన

ఈ మీడియా సమావేశంలో ఎన్టీవీ ప్రతినిధి ఐదు దశాబ్దాల మీ నటనా ప్రస్థానంలో మీరు చేయని క్యారెక్టర్లు లేవు, అందుకోని అవార్డులు లేవు, రివార్డులు లేవు. అయినా ఈ సేనాపతి క్యారెక్టర్ కోసం ఐదు గంటల పాటు మేకప్ కోసం కూర్చుని ఉండడం అంటే కష్టం. అలాంటిది మీరు కష్టపడి ఈ క్యారెక్టర్ చేశారు. ఇంతలా మిమల్ని ఏది ముందుకు నడిపిస్తోంది అని అడిగితే. మీలాంటి జర్నలిస్టులు ఇలాంటి ప్రశ్నలు అడిగి ప్రశంసించి మర్చిపోతారు. మీరు చెబుతున్నది వింటే ఇంకా వినడానికి ఏమీ లేదు ఇక అన్నీ చేసేశారు అనే ఫీలింగ్ వస్తోంది. మీరు అందుకోని అవార్డులు లేవు అంటే ఇంకా దొరకని అవార్డులు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. మీరు ఎందుకండీ ఈ షార్ప్ ఎడిటింగ్ ఎందుకండీ చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version