Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే ప్రేమకథలు ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అవుతాయి. సరిగ్గా అదే తరహా ఫీల్ గుడ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “కళ్యాణం కమనీయం జీవితం”. వివిఫైメディア ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, జెమినీ సురేష్ అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు.
టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టార్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “ఈ సినిమా టైటిల్ చాలా అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడేలా ఉంది. టీజర్ చూస్తుంటే విజువల్స్ చాలా గ్రాండ్‌గా, భారీ ఎత్తున తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. దర్శకుడు రవి తన నిజ జీవితంలోని కొన్ని సంఘటనల నుంచి ఇన్స్పైర్ అయి ఈ సినిమా చేశానని చెప్పడం ఆనందంగా ఉంది. గతంలో చాలా మంది కొత్త దర్శకులు తమ రియల్ లైఫ్ లవ్ స్టోరీస్ ఆధారంగా తీసిన సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అయ్యాయి. అదే సెంటిమెంట్ రిపీట్ అయి ఈ ‘కళ్యాణం కమనీయం జీవితం’ కూడా పెద్ద విజయం సాధించాలి” అని బెస్ట్ విషెస్ అందించారు. దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. “నా ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిరూపం ఈ సినిమా. నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు కొద్దిగా ఫిక్షనల్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ జోడించి ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని రూపొందించాను. రైటర్ అరవింద్ యాడ్ చేసిన ఒక కొత్త పాయింట్ వల్ల స్క్రిప్ట్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది” అని చెప్పారు.
Also Read
- Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!