డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టిల్లు స్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమాలో అనుపమ హాట్ షో తో అదర గొట్టింది. అనుపమ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా రూ.125 కోట్ల కలెక్షన్స్ సాధించి సిద్దు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Allu Arjun – Trivikram : ఆగిపోలేదు.. వాయిదా పడింది?
ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. నిజానికి మొదటి భాగాన్ని ఒక దర్శకుడు రెండవ భాగాన్ని మరో దర్శకుడు డైరెక్ట్ చేశారు. ఇక మూడవ భాగాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానంగా మాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తాడని ప్రకటించారు నిర్మాత నాగవంశీ. తాజాగా జరిగిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రెస్ మీట్ లో ఈ మేరకు ప్రకటించాడు ఆయన.
