NTV Telugu Site icon

Krishna in Kalki 2898 AD: సీనియర్ ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూపిద్దాం అనుకున్నాం.. కానీ?

Sr Ntr As Krishna In Kalki 2898 Ad

Sr Ntr As Krishna In Kalki 2898 Ad

Sr NTR as Krishna in Kalki 2898 AD: కల్కి 2898 ఏడి సినిమా గురువారం నాడు రిలీజ్ అయింది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాలో మొదటి 20 నిమిషాలలో కృష్ణుడి సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయని సినిమా చూసిన వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ ని ఏఐ ద్వారా రీ క్రియేట్ చేస్తారని ఆయనను మళ్ళీ చూపించబోతున్నారని సినిమా రిలీజ్ కి ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నేపథ్యంలో నిజంగానే సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారని అనుకున్నారు కానీ అక్కడ తమిళ నటుడు కనిపించడంతో నిరాశకు గురయ్యారు.

Aswani Dutt: అమితాబ్ చేసిన దానికి తల కొట్టేసినట్టనిపించింది.. కానీ హ్యాట్సాఫ్!!

అయితే ఇదే విషయాన్ని అశ్విని దత్ ముందు ఉంచగా వాస్తవానికి ప్రచారం జరిగినట్టే ముందుగా సీనియర్ ఎన్టీఆర్ ని రీ క్రియేట్ చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. డబ్బింగ్ కూడా చెప్పించినట్టున్నారు కానీ తాను ఇంకా సినిమా చూడలేదు కాబట్టి ఎందుకు అలా జరిగిందనే విషయం మీద తనకు క్లారిటీ లేదని ఈ సందర్భంగా అశ్వినిదత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ పాత్ర చేసింది కూడా ఒక ఫెమిలియర్ తమిళ నటుడేనని ఆయన అన్నారు. అదే విషయం ఈరోజు పేపర్లో అలాగే డిజిటల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున హైలైట్ అవుతుందని ఆయన వెల్లడించారు.

Show comments