Site icon NTV Telugu

Kalki Koechlin : భ‌ర్తను వేరొక‌రితో చూడ‌టం చాలా క‌ష్టం.. న‌టి ఆవేద‌న‌!

Kalki Kochin

Kalki Kochin

బంధం ఎలాంటి అయిన విడిపోతే ఆ బాధ తట్టుకోలేము. అందు‌లోను భార్యబర్తల బంధం అయితే జీవితం ముగిసినట్లే. మన అనుకున్న వారు వదిలి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. కానీ కొంత మంది జీవితాల్లో అది తప్పనిసరి అవుతుంది. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది మామూలు. ఎంత త్వరగా పెళ్ళిలు చేసుకుంటారో అంతే త్వరగా విడిపోతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్..

Also Read : Abbas : తిరిగి రావడానికి సిద్ధమైన ‘లవర్ బాయ్’ అబ్బాస్!

తన మాజీ భర్త అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన తర్వాత ఆయనను వేరొకరితో చూడటం తనకు నిజంగా బాధ కలిగించిందని ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో వాపోయింది. ‘విడాకుల తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు మాకు అంత సులభం కాదు. ఒకరికొక‌రు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా భ‌ర్తను మరొకరితో చూడటం బాధాకరం.. కానీ జ్ఞాపకాలు చాలా బలంగా ఉంటాయి. ఈ బాధను అధిగమించడానికి ఇద్దరికీ చాలా సంవత్సరాలు పట్టింది. కానీ కాలక్రమేణా ఇద్దరం తిరిగి కలుసుకుని గౌరవప్రదమైన సంబంధాన్ని కొన‌సాగించే స్థితికి చేరుకున్నాం. నా త‌ల్లిదండ్రుల కష్టమైన విడాకులను చూసా.. అందుకే నా బ్రేక‌ప్‌ని జీర్ణించుకోవ‌డం మ‌రింత‌ క‌ష్టత‌రంగా మారింది’ అని తెలిపింది.

అంతే కాదు క‌ష్టకాలంలో ఉన్నప్పటికీ ఇటీవల అనురాగ్ కుమార్తె వివాహ వేడుకలకు క‌ల్కి హాజరైంది. వారు తమ గత బాధను అధిగమించ గలిగారు. ఇక కెరీర్ విషయానికి వస్తే క‌ల్కి కొచ్లిన్ ఇంత‌కుముందు ర‌ణ్ వీర్ సింగ్ గ‌ల్లీబోయ్స్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అనురాగ్ ని పెళ్లాడ‌క ముందు ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో క‌ల్కి న‌టించారు. అనురాగ్ ప్ర‌స్తుతం ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలి, ద‌క్షిణాదికి వ‌ల‌స వ‌చ్చారు. పలు తెలుగు, త‌మిళ‌ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Exit mobile version