NTV Telugu Site icon

Aparna Cinema: ఓపెనైన నెల్లో కల్కిపై కోటి గ్రాస్ సంపాదించిన మల్టీప్లెక్స్

Kalki Aparna

Kalki Aparna

Kalki 2898 AD Crosses the magical mark of 1 CRORE GROSS at Aparna Cinemas: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా సరి కొత్తగా ఓపెన్ అయిన ఒక మల్టీ ప్లెక్స్ లో ఒక ఆసక్తికర రికార్డు క్రియేట్ చేసింది. అదేమంటే ఈ కల్కి సినిమా అపర్ణ సినిమాస్ మల్టీ ఫ్లెక్స్ లో ఐదురోజుల్లో కోటి పది లక్షల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మేరకు అపర్ణ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది.

Kamal Haasan: కమల్‌కి ఇండియన్ 2 నచ్చలేదా.. అదేంటి అంత మాట అనేశాడు?

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, యునానిమాస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Show comments