Site icon NTV Telugu

Kajol : నా కుతురుని చూస్తుంటే గర్వంగా ఉంది ..

Kajol

Kajol

బాలీవుడ్‌ దంపతులు అజయ్ దేవ్‌గణ్‌, కాజోల్‌ తమ కుమార్తె నైసా దేవ్‌గణ్‌ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక క్షణాన్ని ఓ వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ‘ఇది చాలా ఎమోషనల్ మోమెంట్‌.. గర్వంగా ఉంది’ అంటూ కాజోల్ స్పందించారు. 22 ఏళ్ల నైసా, స్విట్జర్లాండ్‌లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ విభాగంలో బీబీఏ (బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) డిగ్రీని పొందింది. ఈ సందర్భంగా ఆమెకు సెలబ్రిటీల నుంచి, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

Also Read : Lokesh ; అజిత్‌తో సినిమా ప్లాన్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇటీవల నైసా సినిమాల్లోకి అడుగుపెట్టనుందన్న వార్తలు వినిపించాయి. అయితే కాజోల్ వాటిని ఖండించారు. నైసా విద్యలో ఆసక్తి ఉన్నదని, ఆటలు, ట్రావెలింగ్‌ కూడా ఆమెకు ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే, అజయ్ దేవ్‌గణ్‌ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈ ఆగస్టు 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇక కాజోల్‌ తాజా చిత్రం ‘సర్‌జమీన్’, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది.

Exit mobile version