అందం అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.గత రెండు సంవత్సరాలుగా ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో చాలా బిజీ గా ఉన్నారు.ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 అలాగే భగవంత్ కేసరి, సత్యభామ వంటి సినిమాలకు కమిట్ అయ్యి ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల తో చాట్ చేసింది..
ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడుగుతున్నటువంటి ప్రశ్నల అన్నింటికీ సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే నేటిజన్స్ తన సినీ కెరియర్ గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈమెను ప్రశ్నించారు. అయితే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కాజల్ ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా కాజల్ ను ప్రశ్నిస్తూ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగేసారు. ఈ విధంగా నేటిజన్ అడగడంతో వెంటనే కాజల్ అగర్వాల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నన్ను పెళ్లి చేసుకునే అదృష్టం గత రెండున్నర సంవత్సరాల క్రితమే వేరొక వ్యక్తిని వరించింది అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. దీంతో కాజల్ అగర్వాల్ చెప్పిన ఈ సింపుల్ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ఈమె గత రెండున్నర సమస్యల క్రితం తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు నీల్ కిచ్లు అనే కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాజల్ తన కొడుకుతో ఎన్నో ఆనంద క్షణాలను అనుభవిస్తుంది.సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ మళ్ళీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.