NTV Telugu Site icon

జిమ్ వేర్ తో కాకరేపుతున్న కాజల్… పిక్ వైరల్

Kajal Aggarwal white outfit Pic Goes Viral

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాజా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లాక్ డౌన్ లో జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న కాజల్ పూర్తిగా వైట్ అవుట్ ఫిట్ తో ఏంజిల్ లా కన్పిస్తోంది. ఈ పిక్ లో కాజల్ మేకప్ ఫ్రీ లుక్ తో అందర్నీ ఫిదా చేసేస్తోంది. ఆమె ఆ పిక్ ను అలా పోస్ట్ చేసిందో లేదో ఇలా నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఇక ఇటీవల కాజల్ అగర్వాల్ తరచుగా తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ బ్యూటీ తెలుగులో “మోసగాళ్లు” అనే చిత్రంతో ఓటిటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కాజల్ “ఆచార్య” చిత్రం విడుదల కోసం చూస్తోంది. ఇంకా నాగార్జున నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది చివర్లో తెరపైకి వస్తాయి. తమిళ చిత్రం “హే సినమిక”లో దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరిలతో కలిసి నటిస్తోంది. ఇంకా “ఘోస్టీ” అనే హర్రర్ కామెడీ, కమల్ హాసన్ “ఇండియన్ 2” చిత్రాలలో కూడా నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)