Site icon NTV Telugu

Kajal Aggarwal : వేకేషన్ మూడ్‌లో కాజల్ అగర్వాల్..భర్తతో రొమాంటిక్ మోమెంట్స్

Kajal

Kajal

టాలీవుడ్‌ అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ ఫిల్మ్‌ షూటింగ్స్‌ నుంచి చిన్న బ్రేక్‌ తీసుకుని ప్రస్తుతం వెకేషన్‌ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల ఆమె తన భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఆస్ట్రేలియాలోని అందమైన యర్రా వ్యాలీకి వెకేషన్‌ కోసం వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దిగిన పలు ఫోటోలను కాజల్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో షేర్‌ చేయగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కాజల్‌ సింపుల్‌ లుక్‌లో, స్మైల్‌తో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. భర్త గౌతమ్‌తో కలిసి తీసుకున్న రొమాంటిక్‌ ఫోటోలు నెటిజన్లను ఫిదా చేశాయి. దంపతులు వైన్‌ టేస్టింగ్‌, బైక్‌ రైడింగ్‌, నేచర్‌ వాక్స్‌ చేస్తూ గడిపిన క్షణాలను ఫాలోవర్లతో పంచుకున్నారు. కాజల్‌ ఇటీవలే నటించిన “భగవంత్‌ కేసరి” సినిమా మంచి సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె కొత్త సినిమాల కోసం స్క్రిప్టులు వింటున్నారు. వెకేషన్‌ పూర్తయిన వెంటనే కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసే అవకాశముందని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌.తాజా ఫోటోలతో కాజల్‌ మళ్లీ ఫ్యాన్స్‌ మనసులు దోచేస్తూ, “ఇదే కాజల్‌ చార్మ్‌!” అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

 

Exit mobile version