Site icon NTV Telugu

కరోనా టైములో కాజల్ ఏం చేస్తుందో తెలుసా ?

Kajal Aggarwal reveals her new hobby

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన సరికొత్త హాబీని ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ముంబై లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ముంబైలోని వారి కొత్త ఇంట్లో నివసిస్తున్నారు. ఈ జంట 2020 అక్టోబర్ 30 న వివాహం చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో కొత్త హాబీని అలవరుచుకున్నారట కాజల్. ఆ కొత్త హాబీ ఏంటంటే… ఇంట్లో కూర్చుని తీరిక సమయంలో అల్లికలు నేర్చుకుంటోంది కాజల్. ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. “పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నప్పుడు మన చుట్టూ నిస్సహాయత, యాంగ్జైటీ అలుముకుంటుంది. ఇలాంటి సమయంలోనే మన మనస్సులను ఏదో ఒక పనిపై కేంద్రీకరించడం చాలా ముఖ్యం. అది ఏదైనా కావచ్చు… నేను ఇటీవల అల్లడం స్టార్ట్ చేశాను. ఇది నాకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్లో మీ ఖాళీ సమయంలో మీరు ఏమి చేస్తున్నారు?” అంటూ తాను అల్లిన అల్లికకు సంబంధించిన పిక్ షేర్ చేసింది కాజల్.

Exit mobile version