చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అందంతో ,అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .టాలీవుడ్ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది..అయితే పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలలో నటించడం తగ్గించిన కాజల్ అగర్వాల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తుంది. తెలుగులో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సత్యభామ మూవీ మే 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో కాజల్ ఎంతో బిజీగా వుంది.తాజాగా సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ గెస్ట్‌గా వచ్చింది.తాజాగా ఆ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ షోలో తన పెళ్లి గురించి,తన కెరీర్ గురించి కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.పెళ్లి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు కారణం ఏంటి అని అలీ అడగగా… పవర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేయడం అంటే నాకు ఎంతో ఇష్టమని కాజల్ తెలిపారు .ప్రస్తుతం తాను చేసిన సత్యభామ సినిమా యాక్షన్ తరహాలో సాగే పాత్ర అని ఆమె తెలిపింది. విలన్స్‌ను కొట్టే పాత్రలు చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ కుదర్లేదు..సత్యభామతో ఆ కోరిక తీరిందని కాజల్ తెలిపింది.
