Site icon NTV Telugu

Kajal Agarwal : మరోసారి బాలయ్య సినిమాలో కాజల్..?

Whatsapp Image 2024 05 08 At 7.48.40 Am

Whatsapp Image 2024 05 08 At 7.48.40 Am

నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “భగవంత్ కేసరి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు .ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటించింది.దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తనదైన కామెడీ టచ్ ఇస్తూ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తన క్యూట్ లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంది .గత ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు

ఈ మూవీ “ఎన్‌బికె 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్ మరియు ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు .ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించినా కూడా ఆమెది హీరోయిన్‌ పాత్ర కాదని, ఆమె పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నదని సమాచారం. అలాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించనుందని సమాచారం.అయితే కాజల్‌ ఈ సినిమాలో నెగిటీవ్‌ షేడ్స్‌ ఉండే పాత్ర చేస్తుందని సమాచారం.

Exit mobile version