NTV Telugu Site icon

KA : తొలి రోజు అదరగొట్టిన కిరణ్ అబ్బవరం ‘క’..

Kaa Cs

Kaa Cs

KA : తొలి రోజు అదరగొట్టిన ‘క’యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో “క” సినిమాను ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేసారు.

Also Read : VenkyAnil3 : సంక్రాంతికి వస్తున్న వెంకీ – అనిల్ రావిపూడి

ఆక్టోబరు 30న ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో పండుగ నాడు అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. సెన్సేషనల్ ఓపెనింగ్ రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 6.18 కోట్లు రాబట్టాడు.ఈ ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళికి కేవలం తెలుగులో మాత్రమేవిడుదలైంది. రానున్న వారం తమిళ్, కన్నడ, మలయాళం, హింది బాషలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరానికి ‘క’ మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగానే హిట్టు కొట్టి మరి చూపించారు ఈ యంగ్ హీరో.

Show comments