NTV Telugu Site icon

KA : మీకు అలా అనిపిస్తే నేను సినిమాలు మానేస్తా : కిరణ్ అబ్బవరం

Ka (2)

Ka (2)

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”.  దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‌”క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ‌”క” సినిమా ట్రైలర్ ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Also Read : kollywood : తమిళ స్టార్ హీరో శింబు సరసన టాలీవుడ్ క్యూటి

అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ –  “మరో నాలుగు రోజులే ఉంది సినిమా రిలీజ్ కు . చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒకవారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే తమిళనాట థియేటర్స్ దొరకలేదు. క” సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. నా గత సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి లేకుండా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఎంతో జాగ్రత్తగా సినిమాను చేశాం. మా మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. “క” సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. “క” సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా ” అని అన్నారు.