ఈ ఏడాది మరో ప్రముఖ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా తన ప్రియుడు విష్ణు విశాల్ తో పెళ్ళికి రెడీ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పెళ్లి తేదీని ప్రకటించేసింది. ఏప్రిల్ 22 న గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం తమ సంబంధాన్ని ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జ్వాలా గుత్తా, తమిళ నటుడు విష్ణు విశాల్ నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశము అయ్యింది. కాగా విష్ణు విశాల్ 2010లో రజినీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే విష్ణు, రజినీ 2018లో విడిపోయారు. జ్వాలా కూడా ఇంతకుముందు చేతన్ ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జ్వాలా, చేతన్ 2011లో విడిపోయారు. మరోవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ అందరినీ వణికిస్తోంది. ఈ సమయంలో దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య విష్ణు విశాల్, జ్వాలా వివాహం జరగనుంది.
ప్రియుడితో పెళ్లి తేదీని ప్రకటించిన జ్వాలా గుత్తా
