NTV Telugu Site icon

రేపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సర్‌ప్రైజ్

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. యంగ్ టైగర్ కోమరం భీంగా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటలకు కోమరం భీంకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని విడుదల చేయబోతున్నాం. దయచేసి అభిమానులంతా రేపు ఇళ్లలోనే ఉండండి. బయటకు వచ్చి పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది.