NTV Telugu Site icon

Jr NTR Watch: ఎన్టీఆర్ చేతి వాచ్ తో హైదరాబాదులో మూడు లగ్జరీ ఫ్లాట్లు కొనేయచ్చు తెలుసా?

Jr Ntr Watch

Jr Ntr Watch

Jr NTR wearing Patek Philippe – Grand Complications series watch Worth 2.5 Crores: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు వాచ్ కలెక్షన్ చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలు చెప్పారు కూడా. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా దాన్ని కొనుగోలు చేస్తుంటాడని అంటారు. ఇప్పటికే ఎన్నో వాచ్ లు ఉన్నాయి.. తాజాగా మరో బ్రాండెడ్ వాచ్ ను ఎన్టీఆర్ ధరించగా ఆ వాచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ కి హాజరైన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ రామనాయడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో తారక్ కొడుకులు ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

TG Vishwaprasad: ‘మిస్టర్ బచ్చన్’ ధమాకా ప్లస్.. అందుకే ఆగస్టు 15కి వస్తున్నాం: నిర్మాత విశ్వ ప్రసాద్ ఇంటర్వ్యూ

అయితే ఆ ఫోటోలలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై నెటిజన్ల దృష్టి పడింది. దీని ధర ఎంత ఉంటుందబ్బా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వారు, దాని రేటు చూసి అవాక్కవుతున్నారు. ఆ వాచ్ స్విట్జర్లాండ్ కు చెందిన పాటక్ ఫిలిప్ అనే లగ్జరీ బ్రాండెడ్ వాచ్ అని తెలుస్తోంది. చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ, దాని ఖరీదు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుంది. నిజానికి ఈ బ్రాండ్లో లభించే ప్రతీ వాచ్ చాలా విలువైనదే. తారక్ గతంలో కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి దీనిని ధరించి కనిపించాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఓపెనింగ్ అయింది.

Show comments