NTV Telugu Site icon

Devara: దేవర రిజల్ట్.. కొరటాల శివ, థాంక్స్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్

Devara Review Ntv

Devara Review Ntv

Jr NTR Tweets on Devara Movie Response: చాలా కాలం నుంచి అభిమానులందరూ ఎదురుచూస్తున్న దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిన్న అర్ధ రాత్రి ఒంటిగంట నుంచే అమెరికా సహా భారతదేశంలోని చాలాచోట్ల స్పెషల్ షోస్ పడ్డాయి. సినిమాకి మొదటి ఆట నుంచి కాస్త పాజిటివ్ వస్తుంది. 23 ఏళ్ల తర్వాత తన తండ్రి సెంటిమెంట్ బ్రేక్ అయింది అంటూ రాజమౌళి కొడుకు ట్వీట్ కూడా చేశారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా రిజల్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మీ అద్భుతమైన రియాక్షన్స్ చూసి నేను ఆనంద పడుతున్నాను, దేవర లాంటి ఒక ఎంగేజింగ్ డ్రామాని ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని అందించినందుకు కొరటాల శివ గారికి థాంక్స్.

Devara : ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న దేవర కటౌట్

నా సోదరుడు అనిరుద్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తాన్ని ఒకసారి కొత్త లోకంలోకి తీసుకు వెళ్లినట్టు అనిపించింది. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని ఇద్దరికీ స్పెషల్ థాంక్స్ ఈ సినిమా విషయంలో వారిద్దరూ స్ట్రాంగ్ పిల్లర్స్ గా నిలబడ్డారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారికి ధన్యవాదాలు అలాగే సబూ సిరిల్, శ్రీకర్ ప్రసాద్ అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నా అభిమానులు చాలా కాలం తర్వాత సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు, అది నాకు ఇంకా ఆనందాన్నిస్తోంది. మీ ప్రేమకు సదా రుణపడి ఉంటాను. నేను సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేసానో అభిమానులుగా మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Show comments