Site icon NTV Telugu

Jr NTR : ‘వార్ 2’ మూవీ డ‌బ్బింగ్ పనులు.. షురూ చేసిన తారక్

War2

War2

సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’. 2019లో విడుదలైన ‘వార్’ చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రానుంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా. ఇందలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు ఒకరినొకరు ఢీ కొట్టబోతున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇక సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ ఎత్తున స్పెషల్ విఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. మూవీ లోని యాక్షన్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. అంతేకాదు ఈ మూవీలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయట.

Also Read : Kubera: ‘కుబేర’ నుండి పిపిపి.. డుండుండుం.. సాంగ్ రిలీజ్

ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్‌లో ముందు నుండి భారీగా అంచనాలు ఉన్నాయి.. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వార్ 2 సినిమాకి డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యష్‌రాజ్ ఫిలిమ్స్ తాజాగా పంచుకుంది. ఈ వీడియె లో తారక్ చాలా స్టైలిష్ లుక్ లో కనింపించాడు.

 

Exit mobile version