NTV Telugu Site icon

Jr NTR : తమిళ్ హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా!!

Jr Ntr

Jr Ntr

“దేవర” సూపర్ హిట్ ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ఒక రేంజ్ లో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా హిట్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టడం మంచి జోష్ నింపింది. అన్ని తానై దేవరను భుజాలపై మోసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎన్టీఆర్. అందుకు తగ్గ ప్రతిఫలం ఎంజాయ్ చేస్తున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా హైదరాబాద్ RTC X రోడ్ వంటి ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది దేవర. ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై పలు రకాల డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో నటిస్తున్నాడు తారక్. ఆగష్టు 2025లో విడుదల కానుంది వార్ – 2.

Telangana: ఈ నెల 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు..

దాంతో పాటుగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు ఈ సినిమా సంక్రాంతికి 2026లో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు పలు కథలు వింటున్నాడు తారక్. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి కథ చర్చలు చేసారని గత నెల మొదట్లోనే టాక్ నడిచింది. ఇప్పుడు దానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఫైనల్ రౌండ్స్ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. నెల్సన్ ప్రస్తుతం “జైలర్ 2” పై తెరకెక్కించే పనిలో ఉన్నాడు, ఇది 2026లో విడుదల కానుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సితార సంస్థ నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Show comments