NTV Telugu Site icon

Jr NTR : వెయ్యి కోట్ల డైరెక్టర్‌తో ‘ఎన్టీఆర్’?

Jr Ntr

Jr Ntr

Jr NTR Intrested to work with Atlee: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా వెయ్యి కోట్లు కొల్లగొడతాడా? లేదా? అనేది సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర సినిమాతో తేలిపోనుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ డే వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే జరిగితే.. ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ వంద కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా దేవర రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే.. దేవరకు వెయ్యి కోట్లు అనేది.. ఇప్పుడే అంచనా వేయలేము. కానీ టైగర్ మాత్రం వెయ్యి కోట్ల డైరెక్టర్‌తో సినిమా చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్‌తో సినిమా కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. దేవర పార్ట్ 1 రిజల్ట్‌ను బట్టి.. పార్ట్ 2 ఉండనుంది. మరి ఆ తర్వాత టైగర్ లైనప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కానీ చెన్నైలో జరిగిన దేవర ప్రమోషన్లో భాగంగా.. తన ఫేవరెట్ డైరెక్టర్​ వెట్రిమారన్ అని.. తనతో సినిమా చేయాలని చెప్పాడు ఎన్టీఆర్.

Spirit: ‘స్పిరిట్‌’లో భార్య భర్తల విలనిజం? అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా?

దీంతో.. ఈ ప్రాజెక్ట్‌ ఫిక్స్ అయిపోయినట్టే. అయితే.. వెట్రిమారన్ కంటే ముందే.. అట్లీ కూడా ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా టైగరే చెప్పుకొచ్చాడు. తమిళ మీడియాతో ముచ్చటించిన యంగ్ టైగర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘అట్లీ గొప్ప దర్శకుడు, మేము ఒక రొమాంటిక్ కామెడీ కథ గురించి కూడా చర్చించాం. నాకు అట్లీ రాజారాణి అంటే చాలా ఇష్టం, గతంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పాడు, అప్పుడు నేను ఇతర సినిమాలతో బిజీ అయ్యాను, మరోవైపు అట్లీ కూడా బిజీగా ఉన్నాడు. అయితే ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా కలిసి సినిమా చేస్తాం..’ అని చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన అట్లీతో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే చెప్పాలి. చివరగా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన అట్లీ.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. లేదంటే.. బాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా.. ఎన్టీఆర్ మాత్రం వెట్రిమారన్, అట్లీ వంటి మాస్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం గ్యారెంటీ.

Show comments