NTV Telugu Site icon

JR.NTR : హాయ్ నాన్న దర్శకుడితో యంగ్ టైగర్ ఊర మాస్ సినిమా..?

Ntr

Ntr

దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ జోష్ తోనే బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు తారక్. ఇప్పటికి ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చేసాడు. ఈ సినిమా తర్వాత కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రెండు కాకుండా జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ సినిమాకు సైన్ చేసాడు, సన్ పిచ్ర్స్ నిర్మించే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read : Kollywoood : తమిళనాడు నిర్మాతల కౌన్సిల్ సంచలన నిర్ణయం

ఇప్పుడు ఈ మూడు సినిమాలు కాకుండా మరో సినిమాకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిన్నటి నుండి ఈ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టార్ దర్శకుడికి కాదట. గతేడాది నేచురల్ స్టార్ నాని నటించిన‘హాయ్ నాన్న’ సినిమా కు దర్శకత్వం వహించిన శౌర్యవ్ తో తారక్ సినిమా చేస్తున్నాడట. ఇప్పటికే శౌర్యవ్ జూనియర్ కు కథ వినిపించడం, ఒకే చేయడం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా శౌర్యవ్ మొదటి సినిమా మాదిరి క్లాస్ సినిమా కాదని పక్కా ఊర మాస్ యాక్షన్ సినిమా అని సమాచారం. భారీ బడ్జెట్ పై తెరకెక్కే ఈ సినిమా రెండు భాగాలుగా ఉంబోతుందని టాక్ వినిపిస్తోంది. కానీ శౌర్యవ్ ఈ సినిమాను జూనియర్ తో స్టార్ట్ చేయాలంటే మరో రెండేళ్లు  వరకు ఆగాల్సిందే.

Show comments